: కేంద్రం ఆదేశించినా చంద్రబాబు పట్టించుకోలేదు: కేసీఆర్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు మరోసారి విమర్శలు కురిపించారు. కృష్ణపట్నం, హిందూజాల నుంచి తమకు రావాల్సిన విద్యుత్ ను ఏపీ ఇవ్వడం లేదని... దీనిపై కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వక ఆదేశాలు ఇచ్చినప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు కరెంట్ ఇస్తామన్నా తీసుకోబోమని స్పష్టం చేశారు. శాసనమండలిలో కేసీఆర్ మాట్లాడుతూ, మే తర్వాత కరెంట్ కోతలు ఉండవని చెప్పారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తితే తప్ప కోతలు ఉండవని స్పష్టం చేశారు. 2016 నుంచి రైతులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామని... 2017 చివరకల్లా అన్ని సెక్టార్లకు 24 గంటల కరెంట్ సరఫరా ఉంటుందని వెల్లడించారు.