: మా జీతాలు రూ. 3లక్షలకు పెంచండి: టీ ఎమ్మెల్యేల డిమాండ్... సంతకాల సేకరణ


తెలంగాణ సంపన్న రాష్ట్రం అంటూ గొప్పగా చెప్పిన కేసీఆర్... అదే స్థాయిలో దూసుకుపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాన్ని భారీగా పెంచుతున్నట్టు కేసీఆర్ నిన్న సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇంత వరకు బాగానే ఉంది కానీ... తాజాగా మరో లొల్లి మొదలైంది. తమ జీతాలను రూ. 3లక్షలకు పెంచాలని తెలంగాణ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు అసెంబ్లీ లాబీలో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. అనంతరం సంతకాల సేకరణ పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేయనున్నారు.

  • Loading...

More Telugu News