: నా ఓటమికి అమెరికా, భారత్ లే కారణం: లంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స


మొన్నటి ఎన్నికల్లో తన ఘోర పరాజయానికి శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స కారణాలు కనుగొన్నారు. తన ఓటమికి పొరుగు దేశం భారత్, అగ్రరాజ్యం అమెరికాలే కారణమని ఆయన తేల్చేశారు. ఇప్పటికే భారత్ వల్లే ఓడిపోయానని వ్యాఖ్యానించిన ఆయన తాజాగా తన ఓటమికి అమెరికానూ కారణంగా చూపడంతో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారత్, అమెరికా... నా ఓటమే లక్ష్యంగా పనిచేశాయి. ఈ విషయం అందరికీ తెలుసు. నన్ను ఓడించడానికి ఈ రెండు దేశాలు తమ రాయబార కార్యాలయాలనూ బహిరంగంగానే ప్రోత్సహించాయి. ఇక దేశంలోని భారతీయులందరూ నా ఓటమి కోసం పనిచేశారు. ఈ విషయం నాకు అప్పుడే తెలుసు. ‘మీరేం చేస్తున్నారో నాకు తెలుసు. కానీ, ఇదంతా ఎందుకు చేస్తున్నారు?’ అని వారిని అడిగాను కూడా. అయితే వారి ఆలోచనలు వేరుగా ఉన్నాయి. శ్రీలంకకు సాయం చేసేది చైనా మాత్రమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News