: ఓపెనర్లు ఔట్... రెండు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా


జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (16), శిఖర్ ధావన్ (4) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన వీరిద్దరి జోడీ పెద్దగా పరుగులేమీ చేయకుండానే వెనుదిరగడంతో భారత్ స్వల్ప స్కోరుకే రెండు వికెట్లు కోల్పోయింది. వీరిద్దరినీ ఒకే ఓవర్ లో జింబాబ్వే బౌలర్ తినాషే పన్యాంగర ఔట్ చేశాడు. ఓపెనర్లిద్దరూ ఔటవడంతో టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(9), అజింక్యా రెహానే క్రీజులోకొచ్చారు. ప్రస్తుతం ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News