: నల్లగొండలో కేంద్ర మంత్రి సదానంద గౌడ... దత్తన్నతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ నేడు తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహంచనున్నారు. రాష్ట్రంలో రెండు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా బీజేపీ తన అభ్యర్థులను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన బీజేపీ, తన ఇద్దరు అభ్యర్థుల విజయం కోసం శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే సదానంద గౌడ ప్రచారంలో పాలుపంచుకుంటున్నారు.