: ‘ఏలియన్స్’ రియల్ మోసం... ఫ్లాట్ల పేరిట రూ.100 కోట్ల వసూలు: అరెస్టయిన ఎండీ
హైదరాబాదు నగర శివారు, మెదక్ జిల్లా పరిధిలో భారీ రియల్ మోసం వెలుగు చూసింది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ నయా మోసంలో ప్లాట్ల పేరిట 'ఏలియన్స్ రియల్ ఎస్టేట్స్' సంస్థ జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది. రూ.100 కోట్లకు పైగా డబ్బును వసూలు చేసిన సంస్థ ఎండీ హరి చల్లా, ఫ్లాట్ల నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో మోసాన్ని గుర్తించిన బాధితులు అతడిపై రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హరి చల్లాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 'ఏలియన్స్ ప్లే స్టేషన్' పేరిట హరి చల్లా ఈ వసూళ్ల దందాకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.