: డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు... జరిమానాతో వదిలేసిన పోలీసులు?


మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిన్న రాత్రి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. ఈ క్రమంలో అటుగా వచ్చిన అమ్మ రాజశేఖర్ ను తనిఖీ చేసిన పోలీసులు, అతడు నిర్ణీత పరిమితి కంటే అధికంగానే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్లు నిర్ధారించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులకు పట్టుబడ్డ అమ్మ రాజశేఖర్ జరిమానా చెల్లించి వెళ్లిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News