: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా... మరికాసేపట్లో జింబాబ్వేతో మ్యాచ్


వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న లీగ్ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు జింబాబ్వేను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. న్యూజిలాండ్ నగరం ఆక్లాండ్ లో జరగనున్న ఈ మ్యాచ్ లో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగనున్న టీమిండియా విజయం సాధించడం దాదాపు ఖాయమే. ఇప్పటిదాకా ఆడిన మ్యాచ్ లన్నింటిలోనూ విజయం సాధించిన ధోనీ సేన మరో విజయంపై కన్నేసింది. ఈ క్రమంలోనే జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News