: టాలీవుడ్లో కీడు తొలగిపోయేందుకు 'మహా మృత్యుంజయ హోమం'
తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవల కాలంలో ఎందరో ప్రముఖులను కోల్పోయింది. రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యాలతో సెలబ్రిటీలు పిట్టల్లా రాలిపోతుండడంతో సినీ పరిశ్రమను ఓ రకమైన భయం ఆవహించింది. కీడు నెలకొన్న కారణంగానే ఇండస్ట్రీలో ఇలా జరుగుతోందని పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే, స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో హోమం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి 25 వరకు హైదరాబాద్ ఫిలింనగర్ దేవాలయంలో అమృత పాశుపత మహా మృత్యుంజయ హోమం నిర్వహించనున్నట్టు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ తెలిపారు. హోమం తర్వాత టాలీవుడ్ లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని భావిస్తున్నామని చెప్పారు.