: తలసానికి ఎమ్మెల్యే సండ్ర సవాల్... దమ్ముంటే రాజీనామా చేసినట్టు ప్రకటించాలని డిమాండ్


టీ.టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి దక్కించుకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య బహిరంగంగా సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే రాజీనామా చేసినట్టు శాసనసభలో ప్రకటించాలని తలసానికి ఛాలెంజ్ చేశారు. ఎన్నికలకు భయపడే తలసాని రాజీనామాపై ఏమీ మాట్లాడటం లేదన్నారు. అందుకే రాజీనామా ఆమోదింపజేసుకోవడంలేదని సండ్ర ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తలసాని రాజీనామా డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.

  • Loading...

More Telugu News