: సస్పెండైతే అసెంబ్లీకి రాకూడదా?... లాబీల్లో పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదం
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్తత నెలకొంది. లాబీల్లోకి వచ్చిన టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో ఊగిపోయిన రేవంత్ పోలీసులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభ నుంచి సస్పెండైన సభ్యుడు లాబీల్లోకి రాకూడదని ఎక్కడ ఉందో చెప్పాలంటూ ఆయన పోలీసులను నిలదీశారు. అసెంబ్లీ నిబంధనలు తెలుసా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు తమను అడ్డుకోమని ఎవరు పంపారో చెప్పాలంటూ ఎదురు దాడి చేయడంతో పోలీసులు నిశ్చేష్టులయ్యారు. తనను అడ్డుకున్న పోలీసులపైనే రేవంత్ రెడ్డి విరుచుకుపడటంతో అక్కడివారంతా అవాక్కయ్యారు.