: నాపై కేసు పెట్టే దమ్ముందా?... లోక్ సభకు జస్టిస్ కట్జూ సవాల్!


మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసి పార్లమెంట్ ఆగ్రహానికి గురైన జస్టిస్ మార్కండేయ కట్జూ లోక్ సభకే సవాల్ విసిరారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన తనపై కేసు పెట్టే దమ్ము లోక్ సభకు ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు. గాంధీ, నేతాజీలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ లోక్ సభ తీర్మానం చేసిన కొద్దిగంటల్లోనే ఆయన తన బ్లాగ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ గౌరవ సభ్యుడు నాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటున్నారు. నాపై ఏ కేసు పెడతారు? ఏ సెక్షన్ల కింద కేసు పెడతారు? నాపై మోపాల్సిన అభియోగాల కోసం ఎంపీలు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిందే. అందుకే వారికి ఓ సలహా ఇస్తున్నాను. పిచ్చోడి సెక్షన్ కింద మాత్రమే నాపై కేసు పెట్టొచ్చు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News