: కేంద్రానికి డబ్బులే డబ్బులు... లక్ష కోట్ల మార్క్ దాటిన స్పెక్ట్రమ్ వేలం!


లక్ష కోట్ల రూపాయలు రాబట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలానికి మంచి స్పందన లభించింది. ఈ నెల 4న ప్రారంభమైన ఈ వేలం నిన్నటితో ముగిసిందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఎనిమిది రోజుల పాటు 49 రౌండ్లలో జరిగిన వేలం దూకుడుగా సాగగా... రూ.1,02,057 కోట్లు వచ్చినట్టు చెప్పారు. "అన్ని బ్యాండ్లకు ఈ వేలం జరిగింది. 8వ రోజు వేలం చాలా ఉత్సాహంగా జరిగింది. 2100 మెగాహెర్ట్జ్, 1800 మెగాహెర్ట్జ్, 900 మెగాహెర్ట్జ్, 800 మెగాహెర్ట్జ్ బ్యాండ్లకు చాలా దూకుడుగా వేలం జరిగింది" అని టెలికాం విభాగం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలోని 17 సర్కిళ్లలో మొత్తం నాలుగు బ్యాండ్ల 2జీ, 3జీ స్పెక్ట్రమ్ ను వేలం వేసింది. ఇందులో ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్ రిలయన్స్ సహా ఎనిమిది ప్రముఖ టెలికాం సంస్థలు పాల్గొన్నాయి.

  • Loading...

More Telugu News