: వెంకయ్యతో సుజనా భేటీ... విభజన చట్టం అమలుపై చర్చ


కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుతో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి భేటీ అయ్యారు. నేటి ఉదయం ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన మేర కేటాయింపులు దక్కని నేపథ్యంలో స్వపక్షం నుంచే కాక ఇతర పార్టీల నుంచి కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాలకు న్యాయం చేసేలా ప్రధాని నరేంద్ర మోదీని ఒప్పించేందుకు వెంకయ్యనాయుడు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేటి వెంకయ్య, సుజనాల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News