: శ్రీలంక చేరుకున్న ప్రధాని మోదీ
విదేశీ పర్యటనల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఉదయం శ్రీలంక చేరుకున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా లంకలో చివరిగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా లంక ప్రధాని రాణిల్ విక్రమసింగే, విదేశీ వ్యవహారాల ప్రతినిధి సయద్ అక్బరుద్దీన్ లు మోదీకి విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికారు. భారత్-శ్రీలంకల ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, మైత్రిపాల సిరిసేన చర్చలు జరుపుతారు. కాగా మోదీ ఆ దేశంలో పర్యటన నేపథ్యంలో 86 మంది భారత జాలర్లను విడుదల చేయాలని సిరిసేన ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 28 సంవత్సరాల తరువాత లంకలో ఓ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.