: రాత్రంతా అసెంబ్లీలోనే కేరళ ఆర్థిక మంత్రి... విపక్షాల నిరసనల మధ్యే బడ్జెట్ ప్రవేశపెట్టిన వైనం
కేరళలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మద్యపాన నిషేధం నేపథ్యంలో బార్ లైసెన్సుల కోసం లిక్కర్ వ్యాపారుల వద్ద ఆర్థిక మంత్రి కేఎం మణి భారీగా లంచాలు తీసుకున్నారని విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని విపక్షం నిర్ణయించింది. విపక్షాల నిరసనను ముందే పసిగట్టిన మంత్రి మణి రాత్రంతా అసెంబ్లీలోనే మకాం వేశారు. నేటి ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే ఆయన విపక్ష సభ్యుల నిరసనల మధ్యే బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా ఊగిపోయిన విపక్ష సభ్యులు సభలో వీరంగం చేశారు. స్పీకర్ కుర్చీని విసిరేసిన సభ్యులు మైకులనూ విరిచేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.