: కేరళ అసెంబ్లీలో విపక్షం వీరంగం... స్పీకర్ కుర్చీని గిరాటేసి, మైకులు విరిచేసిన వైనం


కేరళ అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. కాస్త ముందుగానే సభలోకి ప్రవేశించిన విపక్ష సభ్యులు, అధికార పార్టీ సభ్యులను అడ్డుకునే క్రమంలో అసెంబ్లీ భవనం గేట్లన్నీ మూసేశారు. అనంతరం సభలో స్పీకర్ కుర్చీని గిరాటేసి, మైకులను విరిచేశారు. విపక్ష సభ్యుల బీభత్సకాండలో ఓ ఎమ్మెల్యేకు గాయాలయ్యాయి. ప్రతిపక్ష సభ్యులు భవనం గేట్లన్నిటినీ మూసివేయడంతో అధికార పార్టీ సభ్యులు అసెంబ్లీ బయటే నిలిచిపోయారు. నేడు అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉంది. ప్రతిపక్ష సభ్యుల వీరంగంతో అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • Loading...

More Telugu News