: నిన్నటి ముహూర్తమే... నేడు ఏపీ అసెంబ్లీ ముందుకు ‘సాగు’ బడ్జెట్


ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సర్కారు నేడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. నిరుటి మాదిరిగానే వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ ను రూపొందించిన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నేటి సభలో తన పద్దును ప్రవేశపెట్టనున్నారు. నిన్నటి సాధారణ బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యవసాయ రంగానికి రూ.9 వేల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులను ఏఏ అంశాలకు ఎంతెంత ఖర్చు పెడతారన్న విషయాన్ని ప్రత్తిపాటి వెల్లడించనున్నారు. శాసనమండలిలో ప్రత్తిపాటి సాగు బడ్జెట్ ను మరో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. నిన్నటి సాధారణ బడ్జెట్ ముహూర్తానికే నేటి మధ్యాహ్నం 12.15 గంటలకు ఉభయసభల్లో సాగు బడ్జెట్ ను చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

  • Loading...

More Telugu News