: నన్ను కొట్టాలంటే ఎత్తు, బరువు ఉంటే సరిపోదు... అవతల కూడా నేనే ఉండాలి: గోపీచంద్


మంచి సినిమా చేశానని 'జిల్' సినిమా కథానాయకుడు గోపీచంద్ చెప్పాడు. 'జిల్' సినిమా ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, సినిమాకు కథ, సంగీతం చక్కగా కుదిరాయని అన్నాడు. తనను సినిమాలో బాగా చూపించారని అన్నాడు. సినిమాలో హీరోయిన్ హావభావాలు బాగా పలికించిందని కొనియాడాడు. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా? అని ఎదురు చూస్తున్నానని గోపీచంద్ అన్నాడు. సినిమాను అభిమానులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని చెప్పాడు. "నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు, బరువు ఉంటే సరిపోదు... అవతల కూడా నేనే ఉండాలి" అని గోపీచంద్ డైలాగ్ చెప్పి అభిమానులను అలరించాడు.

  • Loading...

More Telugu News