: లండన్ లో గాంధీజీ విగ్రహావిష్కరణకు బిగ్ బీ
లండన్ లోని పార్లమెంట్ స్క్వేర్ లో జరగనున్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ హాజరవుతున్నారు. ఈ మేరకు ఆయనను అతిథిగా ఆహ్వానించినట్టు డీసీఎంఎస్ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో తెలిపింది. ఈ పోస్టునే అమితాబ్ తన అభిమానులకు, సోషల్ మీడియాలో ఫాలోవర్లకు రీట్వీట్ చేశాడు. మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చి 100 ఏళ్లయిన సందర్భంగా ఆ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. బ్రిటీష్ శిల్పి ఫిలిప్ జాక్సన్ విగ్రహాన్ని తయారుచేశాడు. దాన్ని మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించనున్నారు.