: ఆఫ్ఘనిస్థాన్ లో రెచ్చిపోయిన తాలిబన్లు... పోలీసుల కాల్చివేత


ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఏకంగా ఏడుగురు పోలీసులను కాల్చిచంపారు. వివరాల్లోకి వెళితే, పోలీసులు జీతాలు తెచ్చుకోవడానికి వెళ్లి వస్తుండగా... 30 మంది తాలిబన్లు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ హత్యాకాండలో ఏడుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కుందుజ్ ప్రావిన్స్ లో జరిగిందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News