: సిక్సర్ల రికార్డు నెలకొల్పిన డివిలియర్స్
సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ వరల్డ్ కప్ లో సిక్సర్ల ప్రపంచరికార్డు సృష్టించాడు. ప్రపంచకప్ లో ఏబీ డివిలీర్స్ ఇప్పటి వరకు 20 సిక్సర్లు బాదాడు. దీంతో, ఓ వరల్డ్ కప్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన వీరుడిగా నిలిచాడు. అతని తరువాతి స్థానంలో వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ (18) ఉన్నాడు. 2007 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హేడెన్ సృష్టించిన 18 సిక్సుల రికార్డును ఏబీ చెరిపేశాడు. తాజా వరల్డ్ కప్ లో కొట్టిన సిక్సర్లతో కలిపి అన్ని ప్రపంచకప్ లలో డివిలియర్స్ ఇప్పటి వరకు 36 సిక్సులు బాదాడు. అతని తరువాతి స్థానంలో 31 సిక్సులతో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ ఉన్నాడు.