: కేసీఆర్ టీంపై తేనెటీగల దాడి... పరుగులు పెట్టిన అధికారులు
మెదక్ జిల్లా గజ్వేల్ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోకల నిమిత్తం ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్ద అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు అధికారులు పరుగులు తీశారు. ప్రస్తుతం నిజామాబాద్ పర్యటనలో ఉన్న ఆయన మిషన్ కాకతీయను ప్రారంభించారు. మరి కాసేపట్లో హెలీపాడ్ కు ఆయన వస్తారనగా ఈ ఘటన జరిగింది. కొంతమంది అధికారులకు గాయాలు అయినట్టు సమాచారం. తేనెటీగల దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.