: ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడీనే: చెవిరెడ్డి


ఏపీ ప్రభుత్వం తొలిసారి ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ బడ్జెట్ తో పోల్చుకుంటే ఏపీ బడ్జెట్ లో కేటాయింపులు చాలా తక్కువగా జరిగాయన్నారు. కీలక రంగాలన్నింటికీ నామమాత్రపు కేటాయింపులు చేశారని, ఇదంతా అంకెల గారడీనేనని ఆరోపించారు. అసలు ఇదేం బడ్జెట్? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి, అంగన్ వాడీల జీతాల పెంపు వంటి అంశాలను అసలు ప్రస్తావించనేలేదని చెప్పారు. యనమల బడ్జెట్ అన్ని రంగాలను మోసం చేసేలా ఉందని చెవిరెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News