: మసరత్ అలంను విడుదల చేయడానికి గల కారణాలివే: జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం
వేర్పాటువాద నినాదం భుజాలకెత్తుకుని పలు విడతలుగా 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన మసరత్ అలంను జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో భగ్గుమన్న విపక్షాలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేశాయి. ఈ వ్యవహారంతో బీజేపీ ఇరకాటంలో పడింది. ఇటీవలే జమ్ము కాశ్మీర్ లో బీజేపీ సహకారంతో పీడీపీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం... మసరత్ అలంను నిర్బంధించడానికి తమకు ఎలాంటి కారణాలు కనిపించలేదని, అందుకే అతడిని విడుదల చేశామని కేంద్రానికి లేఖ రాసింది.