: డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన మాయగాడు అవినాశ్
ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పను పెను వివాదంలోకి లాగిన మాయగాడు అవినాశ్ ఎట్టకేలకు లొంగిపోయాడు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఏపీ డీజీపీ కార్యాలయానికి వచ్చిన అతడు పోలీసులకు లొంగిపోయాడు. ఉద్యోగాల పేరిట తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేయడమే కాక, డబ్బు తిరిగి ఇవ్వమని అడిగిన వారికి బడితె పూజ చేసిన అతడు ఏపీలో సంచలనం రేపాడు. చినరాజప్ప, తమిళనాడు గవర్నర్ రోశయ్యలతో కలిసి తీయించుకున్న ఫొటోలనే పెట్టుబడిగా పెట్టిన అతడి చేతివాటం కలకలం రేపిన సంగతి తెలిసిందే. పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టగా, వారందరి కళ్లుగప్పి అతడు డీజీపీ కార్యాలయంలో లొంగిపోవడం విశేషం.