: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ముఖ్యాంశాలు... పార్ట్-1


2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అందులోని ప్రధానాంశాలు... * అంబేద్కర్ ను ఉటంకిస్తూ మొదలైన యనమల ప్రసంగం * ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ రూ. 1,13,048 కోట్లు * ప్రణాళికేతర వ్యయం రూ. 78,626 కోట్లు * ప్రణాళికా వ్యయం రూ. 34,412 కోట్లు * రెవెన్యూ లోటు రూ. 7,300 కోట్లు * ఆర్థిక లోటు రూ. 17,584 కోట్లు * మూలధన బడ్జెట్ రూ. 9,818 కోట్లు * సమానత్వాన్ని, సమగ్రతనూ సాధించే బడ్జెట్ ఇది * విభజన ముందు పాలన పడకేసింది * విభజన తీరుతో సంక్లిష్టంగా మారిన పరిస్థితి * ఎన్నో అవకాశాలు కోల్పోయాం * ప్రస్తుత వనరులు రాష్ట్ర అభివృద్ధికి సరిపోవు * అభివృద్ధిలో 2001లో 10వ స్థానం నుంచి 2008లో 15వ స్థానానికి దిగజారాము * రెవెన్యు లోటు కొనసాగుతోంది * భవిష్యత్తులో పెరుగుతుంది * ప్రకృతి సైతం హుద్ హుద్ రూపంలో విరుచుకుపడింది * ఇది జీరో బేస్డ్ బడ్జెట్ * ప్రజలపై అదనపు భారం మోపబోము * విభజన హామీల అమలుకు కృషి * తాగునీటికి రూ. 5,258 కోట్లు * సాంఘిక సంక్షేమానికి రూ. 2,123 కోట్లు * గిరిజన సంక్షేమానికి రూ. 993 కోట్లు * వెనుకబడిన తరగతులకు రూ. 3,231 కోట్లు * పోలీసు సంక్షేమానికి రూ. 40 కోట్లు * రవాణా రంగానికి రూ. 122 కోట్లు * విపత్తుల నివారణకు రూ. 488 కోట్లు * అటవీ శాఖకు రూ. 284 కోట్లు

  • Loading...

More Telugu News