: ఇరుకున పడ్డ ఇరుకుపాలెం వీఆర్వో... లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం


నిజంగానే ఇరుకుపాలెం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్వో) శ్రీనివాసరావు ఇరుకున పడ్డాడు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. వివరాల్లోకెళితే... గుంటూరు జిల్లా, ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం వీఆర్వోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు, లంచాల పేరిట జనాన్ని పీడిస్తున్నాడు. అతడి వేధింపులు మరింత ఎక్కువ కావడంతో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో నేటి ఉదయం పక్కా ప్లాన్ తో గ్రామానికి చేరుకున్న ఏసీబీ అధికారులు, సదరు ఫిర్యాదుదారుడి నుంచి రూ.9 వేలు లంచం తీసుకుంటున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News