: రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు... అరెస్ట్ చేసిన పోలీసులు
టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై ఇటీవల రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నేటి ఉదయం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.