: ఈ సారి రైతుల వంతు... మన్ కీ బాత్ లో రైతులతో మాట్లాడనున్న ప్రధాని మోదీ


ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’లో ఈ సారి రైతు సమస్యలు ప్రస్తావనకు రానున్నాయి. ఈ నెల 22న ఆలిండియా రేడియోలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో మోదీ, రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు రైతుల నుంచి సలహాలు కోరుతూ ప్రధాని కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మారుమూల ప్రాంతాల ప్రజలతోనూ నేరుగా మాట్లాడాలన్న ఉద్దేశ్యంతో నరేంద్ర మోదీ ఈ కొత్త తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముగ్ధుడైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా తన భారత పర్యటనలో మోదీతో కలిసి మన్ కీ బాత్ లో పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News