: 2015-16 ఏపీ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పలికింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను పద్దు లెక్కలను చివరిసారి పరిశీలించేందుకు ఈ ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులు, రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల వివరాలను చంద్రబాబు మంత్రులకు వివరించారు. అనంతరం రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను మంత్రివర్గం ఆమోదించింది. కాగా, నేటి మధ్యాహ్నం 12.15 గంటలకు శాసనసభలో బడ్జెట్ ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో పురపాలకశాఖ మంత్రి నారాయణ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు.