: అసెంబ్లీ కమిటీ హాల్ లో ఏపీ కేబినెట్ ప్రారంభం... బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రివర్గం


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అసెంబ్లీలోని కమిటీ హాల్ లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఏపీ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. తెలంగాణ కంటే మెరుగైన బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించిన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ రూపకల్పనలో భారీ కసరత్తే చేశారు. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాల మాఫీ కోసం భారీ కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఆర్థిక లోటు ఉన్నప్పటికీ సంక్షేమ రంగానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News