: నాలుగేళ్లు పూర్తి చేసుకున్న జగన్ పార్టీ... నేడు ఆవిర్భావ దినోత్సవం


దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ (యువజన శ్రామిక రైతు) కాంగ్రెస్ పార్టీ నిన్నటితో నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నేడు నాలుగో ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. పార్టీ అధినేత జగన్, నేడు లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. నాలుగేళ్ల ప్రస్థానంలో తొలుత ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఆ ఎన్నికల్లో ఏపీలో 60కి పైగా స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ తెలంగాణలోనూ తన ఖాతా తెరిచింది. ఖమ్మం ఎంపీ సీటుతో పాటు అదే జిల్లాలో మూడు అసెంబ్లీ స్ధానాలను కూడా గెలుచుకుంది. జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదు, అరెస్ట్ తదితర కారణాలతో పార్టీ ప్రాభవం క్రమంగా తగ్గిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News