: పోలీసుల భయంతో నాలుగో అంతస్తు నుంచి దూకేసిన పేకాటరాయుడు... పరిస్థితి విషమం
పేకాటరాయుళ్లంతా కలిశారు. ఎంచక్కా హోటల్ లోని నాలుగో అంతస్తులో గది అద్దెకు తీసుకున్నారు. తలుపులేసుకుని పేక ముక్కల్లో లీనమైపోయారు. పోలీసులొస్తున్నారన్న సమాచారంతో సదరు గదిలో అలజడి రేగింది. పోలీసులు అరెస్ట్ చేస్తే పరువు పోతుందనుకున్నాడో, ఏమో తెలియదు కాని, ఓ పేకాట రాయుడు ఏకంగా నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు. హైదరాబాదులోని మణికొండ పరిధిలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. భయంతో కిందకు దూకిన అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.