: ఆలస్యంగా నిద్రపోతున్నారా?... అయితే, ఇది చదవండి!
ఆలస్యంగా నిద్రపోతున్నారా?... అయితే, మీరు ఊబకాయం ప్రమాదం అంచున ఉన్నారన్నమాట. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం వస్తుందని కార్నెల్ మెడికల్ కళాశాల ప్రొఫెసర్ శహ్రద్ తాహేరీ తెలిపారు. ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించడం వల్ల దాని ప్రభావం జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందట. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఊబకాయం రావడం మాత్రమే కాకుండా, ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ తూగుతారని చెప్పారు. 522 మందిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని రుజువు చేశామని ఆయన తెలిపారు. సమయానికి నిద్రపోయిన వారు ఆరోగ్యంగా, రోజంతా చలాకీగా ఉంటే, ఆలస్యంగా నిద్రపోయిన వారు భారం, బద్దకం తదితర సమస్యలతో ఇబ్బందులు పడ్డట్టు ఆయన వెల్లడించారు. అందుకే పనులు, పార్టీలు అంటూ ఆలస్యంగా నిద్రపోతే ఊబకాయం ముప్పు తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు.