: రాష్ట్రానికి కేంద్రం దశల వారీగా సహాయం చేస్తుంది: సుజనా చౌదరి


కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, జయంత్ సిన్హా, సుజనా చౌదరి సమావేశం ముగిసింది. అనంతరం కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు దశలవారీగా కేంద్రం సహాయం చేస్తుందని అన్నారు. అయితే, నిర్దిష్ట ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని కేంద్రం సూచించిందని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. అయితే, కేంద్రం కూడా కొంత ఇబ్బందుల్లో ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకు అవసరమైన నిధులు అందజేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రం చేసే ప్రతిపాదనలకు కేంద్రం సహకరిస్తుందని ఆయన వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు విడుదల చేసిన నిధులను ఖర్చు చేయాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News