: హైదరాబాదులో స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పిన వీవీఎస్ లక్ష్మణ్
భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ హైదరాబాదులో స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పాడు. వీవీఎస్ లక్ష్మణ్ స్పోర్ట్స్ అకాడమీ పేరిట అజీజ్ నగర్ లోని 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ అకాడమీ నిర్మించారు. ఇందులో క్రికెట్ తో పాటు, ఇతర క్రీడల్లోనూ శిక్షణ ఇస్తారు. ఏప్రిల్ 4 నుంచి మే చివరి వారం వరకు సమ్మర్ కోచింగ్ క్యాంపు నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్ క్రికెట్ వ్యాఖ్యాతగా, విశ్లేషకుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.