: శాకాహారిగా మారిన అమీర్ ఖాన్


ఎప్పుడూ చేపలు, చికెన్, మటన్, గుడ్లను ఎంతో ఇష్టంగా తినే బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అకస్మాత్తుగా శాకాహారిగా మారాడు. పాలు, పాలతో చేసిన ఉత్పత్తులు, నెయ్యి, పన్నీర్, ఇండియన్ స్వీట్స్ కూడా వదిలివేయాలని నిర్ణయించుకున్నాడట. భార్య కిరణ్ రావు చూపించిన ఓ వీడియో తనను శాకాహారం దిశగా నడిపించిందని అమీర్ తెలిపాడు. ఆహారంలో మార్పుల వల్ల సాధారణంగా వచ్చే 15 రకాల రోగాలను అరికట్టవచ్చని ఆ వీడియోలో అర్థవంతంగా చెప్పారని వివరించాడు. శాకాహారిగా మారడంవల్ల జీవితం ఎంత సుఖవంతం అవుతుందో ఆ వీడియో చెబుతుందని 'మిస్టర్ పర్ఫెక్షనిస్ట్' అంటున్నాడు. ప్రస్తుతం అమీర్ 'దంగల్' అనే చిత్రంలో శాకాహారిగా నటిస్తున్నాడని, ఈ క్రమంలో తాజా నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

  • Loading...

More Telugu News