: అస్వస్థతకు గురైన సోనియాగాంధీ
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఇవాళ కూడా పార్లమెంటు సమావేశాలకు హాజరుకాలేకపోయారు. నిన్న కూడా ఆమె పార్లమెంటుకు రాలేదు. అయితే, ఆమె వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని, అందుకే సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరగా కోలుకుంటున్నారని తెలిపాయి.