: స్వైన్ ఫ్లూని కంట్రోల్ చేయడం చేతకాలేదు కానీ... హెలికాప్టర్ అంబులెన్సులట!: కేసీఆర్ ప్రభుత్వంపై టీడీపీ ఫైర్


టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పై టీటీడీపీ నేతలు నిప్పులు చెరిగారు. కేబినెట్ లో మహిళలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్... బడ్జెట్ లో కూడా వారికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించారని... టీఆర్ఎస్ ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. స్వైన్ ఫ్లూని కంట్రోల్ చేయడం చేతకాని ఈ ప్రభుత్వం... హెలికాప్టర్ అంబులెన్స్ లో వైద్యం అందిస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మండలిలో టీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేశామని అనడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. జాతీయగీతాన్ని అడ్డం పెట్టుకుని తమ గొంతు నొక్కేశారని విరుచుకుపడ్డారు. టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్.రమణ, వెంకటవీరయ్యలు మీడియాతో మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News