: నిర్భయ అత్యాచార దోషి రాంసింగ్ దెయ్యంగా మారాడట!


నిర్భయ అత్యాచార దోషుల్లో ఒకడైన రాంసింగ్ దెయ్యంగా మారాడట. రాంసింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రాంసింగ్ కుటుంబం నిర్భయ ఘటనకు ముందు ఢిల్లీలోని సంత్ రవిదాస్ క్యాంప్ లోని మురికివాడలో నివాసం ఉండేవారు. నిర్భయ ఘటన తరువాత ఆ కుటుంబం సొంత రాష్ట్రం రాజస్థాన్ కు తరలిపోయింది. అప్పట్నుంచి ఆ ఇల్లు ఖాళీగా ఉంటోందట. దీంతో, జైలులో మరణించిన రాంసింగ్ ఆత్మ మాత్రం ఆ ఇంట్లోనే మకాం వేసిందటంటున్నారు స్థానికులు. ఆ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా కనిపిస్తే రాంసింగ్ ఆత్మ వదలడం లేదట! దీంతో, ఆ గల్లీలో పిల్లలెవరూ ఆ ఇంటి వైపు వెళ్లవద్దని పెద్దలు హెచ్చరిస్తున్నారు. దెయ్యాలంటే నమ్మకం లేని వారు కూడా ఇప్పుడు తమ పిల్లలను ఆ ఇంటి వైపు పంపేందుకు జంకుతున్నారట.

  • Loading...

More Telugu News