: నా విడుదల చట్ట ప్రకారమే జరిగింది... పీడీపీతో ఎలాంటి ఒప్పందం లేదు: మసరత్ ఆలం


జమ్ము కాశ్మీర్ లోని పీడీపీ ప్రభుత్వం తనను విడుదల చేయడంపై చెలరేగుతున్న విమర్శలపై వేర్పాటువాది మసరత్ ఆలం స్పందించాడు. తన విడుదల చట్ట ప్రకారమే జరిగిందని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో ఎలాంటి ఒప్పందంలేదని తెలిపాడు. ఈ మేరకు ఓ ఆంగ్ల ఛానల్ తో ఆలం మాట్లాడుతూ, "నా విడుదలపై పీడీపీతో ఎలాంటి డీల్ జరగలేదు. ఈ క్రెడిట్ గవర్నమెంట్ తీసుకోలేదు, నేను న్యాయపరమైన ప్రక్రియ ద్వారానే బయటికొచ్చా, 25 కేసుల్లో నాకు బెయిల్ లభించింది. మరో రెండింటిలో నిర్దోషిగా తేలాను. నా విడుదల వల్ల నేను పోరాడుతున్న విషయంలో మార్పురాదు" అని ఆలం వెల్లడించాడు. మరోవైపు, ఆలం విడుదలపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జమ్ము కాశ్మీర్ ప్రభుత్వాన్ని కోరింది.

  • Loading...

More Telugu News