: ఉపశమనం కోసం దీపికా పదుకొనే అరోమా థెరపీ


బాలీవుడ్ లో తాను నటించిన చిత్రాలన్నింటితో విజయపథంలో దూసుకెళుతున్న కథానాయిక దీపికా పదుకొనే. ఒకదానివెంట ఒక చిత్రంతో అమ్మడు ఎప్పుడూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో కొద్దిగా ఉపశమనం కోసం అరోమా థెరపీ మసాజ్ చేయించుకుంటుందట. దానికోసం అడ్వాన్స్డ్ స్పెషల్ ఎడిషన్ అరోమా థెరపీ ఆయిల్ వాడుతానని చెప్పింది. రోజంతా పనిలో మునిగి, అలసిపోయిన సమయంలో ఈ థెరపీ మసాజ్ తనకు పూర్తి రిలాక్సేషన్ ఇస్తుందని చెబుతోంది. ఒత్తిడి నుంచి తేలికగా బయటపడొచ్చని అంటోంది. ఇలా ప్రతిరోజు తనకు కుదరదని, అయితే, బాగా అలసట అనిపించినప్పుడు థెరపీ మసాజ్ చేయించుకుంటానని పేర్కొంది.

  • Loading...

More Telugu News