: వాస్తవానికి విరుద్ధంగా తెలంగాణ బడ్జెట్: డీకే అరుణ
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ ఉందని ఆరోపించారు. అంతేగాకుండా, కేవలం అంకెల గారెడీని తలపిస్తోందన్నారు. పథకాలకు నిధులు ఎలా వస్తాయో బడ్జెట్ లో స్పష్టత లేదని, వాటికోసం పన్నులు పెంచుతారేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. బడ్జెట్ లో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుకు చెందిన శాఖలకే భారీగా నిధులు కేటాయించారని ఆరోపించారు. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందని అన్నారు. ఎన్నికల హామీలైన ఇళ్ల నిర్మాణం, కేజీ టూ పీజీ విద్య ప్రస్తావనే లేదన్నారు.