: ఐఎస్ బాల మిలిటెంట్... బందీని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు!


ఐఎస్ఐఎస్ కిరాతక పర్వంలో మరో దారుణం! ఇజ్రాయెల్ గూఢచారిగా అనుమానిస్తూ బందీగా పట్టుకున్న మహ్మద్ ముసల్లామ్ అనే పాలస్తీనా యువకుడిని కాల్చి చంపారు. ఆ వ్యక్తిని కాల్చింది ఏ కరడుగట్టిన మిలిటెంటో కాదు, ఓ బాలుడు. ఆ బాలుడు కూడా ఐఎస్ సభ్యుడే. ఈ మేరకు ఓ వీడియోను ఐఎస్ అనుబంధ ఫుర్ఖాన్ మీడియా సంస్థ ఆన్ లైన్లో పోస్టు చేసింది. నారింజ పండు రంగు దుస్తుల్లో ఉన్న బందీని మోకాళ్లపై నిల్చోబెట్టి, అతడి వెనుకగా ఐఎస్ మిలిటెంట్, ఓ బాలుడు ఆ వీడియోలో కనిపించారు. ఆ మిలిటెంట్ తమ ప్రకటన పూర్తి చేసిన తర్వాత, ఆ బాలుడు ముందుకు వచ్చి బందీని నిర్దయగా కాల్చేశాడు. ఆ బందీ ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కోసం పనిచేస్తున్నట్టు ఆ వీడియోలో ఆరోపించారు.

  • Loading...

More Telugu News