: కాంగ్రెస్ చేసిన పాపాన్ని మన్మోహన్ మోస్తున్నారు: జవదేకర్


కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ చేసిన పాపాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మోస్తున్నారని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఈరోజు సింగ్ కు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ, "ఇది కాంగ్రెస్ స్కాం. కాంగ్రెస్ చేసిన పాపానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ జీ దాన్ని ఎదుర్కొంటున్నారు" అని వ్యాఖ్యానించారు. ఇందులోకి మాజీ పీఎంను తీసుకొచ్చినందుకు కాంగ్రెస్సే బాధ్యత వహించాలన్నారు. హస్తం పార్టీకి ఇది మరో మచ్చ అన్న జవదేకర్, ఆ పార్టీకి మద్దతిస్తున్న మిగతా రాజకీయ పార్టీలన్నీ ఓసారి పునరాలోచన చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News