: ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ ధ్వంస రచన... అనంతలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై దాడి


రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కేంద్ర సర్కారు వైఖరిపై సీపీఐ ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా అనంతపురంలో ఆ పార్టీ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించిన సీపీఐ కార్యకర్తలు టెలికాం, పోస్టల్ శాఖ కార్యాలయాల్లోకి దూసుకెళ్లారు. కార్యాలయాల్లోని కంప్యూటర్లు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తమను అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులతో వారు వాదులాటకు దిగారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గొడవ తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహా పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News