: షారూఖ్, సల్మాన్ ల సినిమాలే చూస్తా... అసెంబ్లీ చిత్రాలు నా వల్ల కాదు: అక్బరుద్దీన్ వ్యాఖ్య


తెలంగాణ శాసనసభా సమావేశాలు జరుగుతున్న తీరుపై మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అంతేకాక సమావేశాల తీరుపై ఆయన వ్యంగ్యాస్త్రాలూ సంధించారు. "సభలో రోజుకో సినిమా చూపిస్తున్నారు. ఈ సినిమాలు చూడటం నా వల్ల కాదు. నేను షారూఖ్, సల్మాన్ ఖాన్ల చిత్రాలనైతేనే చూస్తాను" అంటూ ఆయన అన్నారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాల తర్వాత బయటకు వస్తున్న ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా సమావేశాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించిన కిషన్ రెడ్డికి సమాధానమిచ్చిన సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News