: కోల్ స్కాం కేసులో మన్మోహన్ సింగ్ కు సమన్లు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు పంపింది. ఆయనతో పాటు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శులు పీసీ పరేఖ్, అలోక్ పెర్తి, హిందాల్కో సంస్థకు చెందిన కుమారమంగళం బిర్లా, సుభేందు అమితాబ్, డి.భట్టాచార్యలకు కూడా సమన్లు జారీ అయ్యాయి. బొగ్గు స్కాం కేసులో ఏప్రిల్ 1న కోర్టు ముందు హాజరుకావాలని వారందరినీ ఆదేశించింది. నేరపూరిత కుట్ర, నమ్మకం ద్రోహం, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద వారికి సమన్లు పంపింది. దానిపై పరేఖ్ స్పందిస్తూ, తనకు పంపిన ఆదేశాల కాపీలను పూర్తిగా చదివాక స్పందిస్తానన్నారు. అంతకంటేముందు ఏ వ్యాఖ్య చేయడం సరికాదని చెప్పారు. కాగా ఇదే కేసులో మన్మోహన్ ను సీబీఐ అధికారులు జనవరి 18న విచారించిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్న సింగ్... ఓ కేసులో ప్రధానమంత్రిని ప్రశ్నించడం ఇదే తొలిసారి.