: ఏపీ అసెంబ్లీ నినాదాల హోరు... వాయిదా తీర్మానాలపై చర్చ కోసం ప్రతిపక్షం పట్టు


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. నిరుద్యోగ భృతిపై ప్రతిపక్షం వైసీపీ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. అయితే, దీనిని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దీంతో ఆ అంశంపై చర్చకు అనుమతించాల్సిందేనని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. ఈ క్రమంలో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగిస్తున్నారు. గరవ్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో చివరి రోజైన నేడు సీఎం ప్రసంగించాల్సి ఉందన్న చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు, విపక్ష సభ్యుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో ప్రారంభమైన వెంటనే సభను స్పీకర్ పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News